HomeDevotionalతెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలిఘనంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర

తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలిఘనంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర

తెలంగాణ ఉద్యమంలో తమ ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసిన ధూంధాం కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు.

కళాకారుల ఐక్యతను చాటేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ‘కళాకారుల బోనాల జాతర’ అత్యంత వైభవంగా ముగిసింది. మంగళవారం మాక్లూర్ మండలంలోని ఒట్యాట్‌పల్లిలో ఒడ్డేటమ్మతల్లికి కళాకారులు ఘనంగా బోనాలు సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం డప్పు దరువులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాల నడుమ కోలాహలంగా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు *ఆర్టీసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అష్ట గంగాధర్, కోశాధికారి రాంపూర్ సాయి, మాట్లాడుతూ.. జిల్లాలోని కళాకారులందరూ ఒకే కుటుంబంగా ఏకమై ఈ వేడుక నిర్వహించుకున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడిన కళాకారుల జీవితాలు నేటికీ దుర్భరంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఉద్యమంలో కష్టపడిన అర్హులైన అన్ని విభాగాల కళాకారులకు తక్షణమే ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కళాకారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఉపాధ్యక్షురాలు రేలారే రేలా గంగా మాట్లాడుతూ.. కళాకారులంతా ఒకే వేదికపైకి వచ్చి ఇలా బోనాల జాతర నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే మొదటిసారని, నిజామాబాద్ జిల్లా కళాకారులు చూపిన ఐక్యత రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శమని కొనియాడారు. ఉద్యోగాల కోసం కళాకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించి సత్వరమే ఆదుకోవాలని కోరారు.

ఈ బోనాల కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంగా, గోదావరి, సాయి లోవల, సవిత, రాజేందర్; సలహాదారులు పస్కా నర్సయ్య, పాశం కుమార్, బొడ్డెన్న యాదవ్, కోకిల నాగరాజు; సహాయ కార్యదర్శులు కర్ర రమేష్, క్రాంతి కుమార్, గోరకంటి రాజు; ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్, ప్రశాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి; కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు, మాదాసు గోపి, తోగరి నర్సయ్య, చిన్న రాజేందర్, రవి నాయక్, డప్పు సంతోష్, మనోజ, దివ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే కళాకారులు పొగరి సంజీవ్, సాయి, విజయ్, సద్గురు, నవీన్, నరేష్‌తో పాటు మహిళా కళాకారిణులు మానస, స్రవంతి, సమత, లత, శ్వేత మరియు పెద్ద ఎత్తున జిల్లా ఉద్యమ కళాకారులు ఈ కార్యక్రమంలోపాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments