రెంట్ ఏ బాయ్ ప్రెండ్ పేరుతొ సాగుతున్న సరికొత్త సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.సోషియల్ మీడియా వేదికగా సాగుతున్న ‘రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్’ పేరుతొ సైబర్ ముఠాలు కొత్త మోసాలకు పాల్పడుతున్నారన్నారు .
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించి ఆకర్షణీయమైన యువకుల నకిలీ ప్రొఫైళ్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రొఫైళ్లను చూసి మోసపోయి, అపరిచిత వ్యక్తుల వలలో పడొద్దని యువతులకు సజ్జనార్ సూచించారు.
తల్లితండ్రులు సైతం తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాలపై నిరంతరం నిఘా ఉంచాలని, కోరారు. అనుమానాస్పద ఆఫర్లు, సైబర్ బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు
