నగరంలో ఇటీవల చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ కేసును టౌన్–I పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా దుర్గానగర్‌కు చెందిన సయ్యద్ మౌలానా, కోడిమ్యాల్ తుర్కాష్‌నగర్‌కు చెందిన షేక్ వలీను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు డ్రైవర్‌గా, మరొకరు రాళ్లు కొట్టే పనిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చైన్ స్నాచింగ్ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు నగరంలో పహారా, నిఘాను ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.
