పార్టీలో ఎంతటి సీనియర్ నాయకుడైన సరే పార్టీ నియమావళి కి లోబడే ఉండలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ ఏం మాట్లాడారో వినలేదు.. ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిది.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
ఇది పార్టీలో అందరికీ వర్తిస్తుందని మహేష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ ఇచ్చిన హామీపై హైకమాండ్ తో మాట్లాడాల్సి ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.
