HomeCRIMEడెలివరీ విషయంలో గొడవ.. స్నేహితుడి దాడిలో యువకుడి మృతి.

డెలివరీ విషయంలో గొడవ.. స్నేహితుడి దాడిలో యువకుడి మృతి.

డెలివరీ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఘర్షణలో ఓ యువకుడిపై ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

కోకాపేటకు చెందిన సమీద్‌ (31) నార్సింగిలోని బ్లింకిట్‌ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న మరో వ్యక్తితో డెలివరీల విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి విధుల్లో ఉండగా మరోసారి ఇదే అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారడంతో సమీద్‌పై అతడి స్నేహితుడు ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తలకు తీవ్ర గాయం కావడంతో సమీద్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments