నగరంలోని షిర్డీ సాయిబాబా నగర్‌లో పాత గోడను కూల్చివేస్తుండగా అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఓ కూలీ దాని కింద చిక్కుకుని మృతి చెందాడు.
పాత భవనం గోడను కూల్చే పనుల్లో భాగంగా కూలీలు పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గోడ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
