కంటేశ్వర్ ప్రాంతంలో వృద్ధురాలి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గడ్డం సుశీలదేవి (80) ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి ఆమె చేతికి ఉన్న ఆరు బంగారు గాజులను లాక్కెళ్లాడు.
అపహరణకు గురైన ఆభరణాల బరువు సుమారు 8.5 తులాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశీలదేవి కుమారుడు గడ్డం చిట్టిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న సాహెబ్‌రావుపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపాడు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
