వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గూపాన్ పల్లిలోని గంగస్థాన్ పేస్ 2 లోగల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నేడు ఉదయం ఐదున్నర గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించార. అనంతరం అమ్మవారికి మల్లె పువ్వులతో తులసి మాలలతో అలంకరణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయం 10:30 గంటల ప్రాంతం నుండి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి , సందీప్ రెడ్డి, లక్ష్మణ్, కవిత, మయూరి, సప్న, కవిత, లతా తదితరులు పాల్గొన్నారు.
