కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డట్లు సమాచారం.
ఓ కేసు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఎస్‌ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు .
దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం దాడిచేసిపట్టుకున్నారు. బాధితుడి నుంచి ఎస్‌ఐ ఆంజనేయులు రూ.30 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
