దేశాభివృద్ధికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి మహేష్‌కుమార్‌గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో రాజీవ్‌గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయన్నారు.
స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారని గుర్తుచేశారు.రాజీవ్‌గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు ఘనమైన నివాళి అని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్‌గాంధీకి నివాళులర్పించారు.
