HomeTelanganaNizamabadమొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌

పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మల్లారం గండి వద్ద గురువారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెంచేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని సూచించారు.

పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments