పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించడంలో టౌన్–I పోలీసులు సాంకేతికతను సమర్థంగా వినియోగించారు. వివిధ ప్రాంతాల్లో పోయిన 52 సెల్ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేశారు.
వాటిని అసలైన యజమానులకు అప్పగించినట్లు ఒకటవ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం,సీఈఐఆర్ వ్యవస్థను వినియోగించి ఫోన్ల ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం సంబంధిత వ్యక్తులను గుర్తించి ఫోన్లను వారికి అందజేశారు.ఫోన్ పోయిన వెంటనే అందులోని బ్యాంకింగ్, ఫోన్‌పే, గూగుల్‌పే తదితర డిజిటల్ చెల్లింపు ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవాలని పోలీసులు సూచించారు.
అలాగే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఖాతాల భద్రత కోసం బలమైన పాస్వర్డ్లు వినియోగించాలని, వాటిని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 52 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
