నిజామాబాద్ నగరంలోని ముజాహిద్‌నగర్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇశ్రాత్ అహ్మద్ (40) మంటల తీవ్రతకు బయటకు రాలేక మరో గదిలో చిక్కుకుపోయాడు.
దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
