HomePOLITICAL NEWSArmoorఅంకాపూర్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

అంకాపూర్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి మిగులు లబ్ధిదారులకు కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments