రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన నకిడి నరేశ్ (30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటలకు తన స్నేహితుడితో కలిసి స్ప్లెండర్ ప్లస్ బైక్‌పై వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు.
ఈ క్రమంలో బీబీపూర్ సమీపంలోని అన్నుల్ దాబా వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు (TS18 B 3633) వేగంగా, అజాగ్రత్తగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది.
ప్రమాదంలో నరేశ్ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటనపై పోలీసులు షిఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
