రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలను నిజామాబాద్ అర్బన్ మేప్మా ఆర్పీల అధ్యక్షురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో ఆర్పీలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాలకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులను కలుసుకోవడం సంతోషంగా ఉందని గణేష్ బిగాల పేర్కొన్నారు.
పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆప్యాయతలు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
