ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీజేపీ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ పోరాటంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రాంచందర్ రావు దీక్షలో కూర్చున్నారు.
