మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ అయ్యారు.కేసు నమోదు దర్యాప్తు లో అలసత్వంపై వహించాడనే అభియోగాల ఫై అతని మీద సస్పెన్షన్ వేటు పడింది . బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు విషయంలో జాప్యం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో జూబ్లీహిల్స్ సీఐ మత్తు యాదవ్ సస్పెన్షన్ అయ్యారు . కాగా సురేఖ మాజీ OSD సుమంత్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. సుమంత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం ఎదుట డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
