L
ఆర్మూర్ పట్టణానికి ఆర్‌అండ్‌బీ (రోడ్లు, భవనాల శాఖ) గెస్ట్‌హౌస్ మంజూరైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తెలిపారు. రూ.3.23 కోట్ల వ్యయంతో గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు సోమవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.గ
త అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన పలు సమస్యలను వివరించడంతో పాటు, అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని వినతులు సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ నేపథ్యంలో గెస్ట్‌హౌస్ మంజూరు కావడంపై ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే.. గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులకు అతి త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
