దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కార్యాలయంలో సోమవారం అమ్మవారి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం ఎగ్జిక్యూటివ్, హైదరాబాద్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉద్యోగులు మాత ఆశీస్సులు పొందారు.
తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు కె.ఆర్. రాజ్‌కుమార్, విజయలక్ష్మి, యోగి, నవీన్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ యూనిట్ జాయింట్ సెక్రటరీ జయంతిరెడ్డి, ఫోరం పబ్లిక్ సెక్రటరీ ప్రవీణతో పాటు రాజేందర్, హైమావతి, మంజు, హేమవతి, సినీత, సుజాత, రమాకాంత్, అనిల్‌రెడ్డి, సరస్వతి, రామచంద్రారెడ్డి, కునారి వల్లి స్వరూపి, కృష్ణమూర్తి, కృష్ణసాగర్, సౌజన్య, సుకన్య, ఖుషాల్, రవికాంత్, రవి, దామోదర్, మహేందర్, శేషికళ, సునీత, లత, పంతులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది.
