HomeTelanganaNizamabadపుష్కర ఘాట్‌కు డబుల్‌ రోడ్డు వేయాలి..కలెక్టర్‌కు నాలుగు గ్రామాల సర్పంచుల వినతి

పుష్కర ఘాట్‌కు డబుల్‌ రోడ్డు వేయాలి..కలెక్టర్‌కు నాలుగు గ్రామాల సర్పంచుల వినతి

చింరాజ్‌పల్లి క్రాస్‌రోడ్డు నుంచి తుంగిన పుష్కర ఘాట్‌ వరకు ఉన్న సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించాలని నందిపేట, నవీపేట మండలాలకు చెందిన నాలుగు గ్రామాల సర్పంచులు కోరారు. పుష్కర ఘాట్‌కు భక్తుల రాకపోకలు పెరిగే నేపథ్యంలో ప్రస్తుత రహదారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విస్తరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నాలేశ్వర్‌, తళ్వేద, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి గ్రామాల సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్‌ రోడ్డు మాత్రమే ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

పుష్కర ఘాట్‌ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ పెరిగితే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. భక్తులు, స్థానిక ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా రహదారిని విస్తరించి డబుల్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments