HomeCRIMEఆటో డ్రైవర్‌పై దాడి.. తలకు తీవ్ర గాయం..

ఆటో డ్రైవర్‌పై దాడి.. తలకు తీవ్ర గాయం..

ఆటోకు కటింగ్‌ ఇస్తూ వెళ్లిన ద్విచక్ర వాహనదారుడిని ప్రశ్నించినందుకు ఓ ఆటో డ్రైవర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో నాగారానికి చెందిన అబ్దుల్‌ కరీం తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్‌ కరీం పాషా తన చెల్లిని ఆటోలో తీసుకుని రైల్వే స్టేషన్‌లో దించేందుకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి ఆటోకు కటింగ్‌ ఇస్తూ వెళ్లాడు. దీంతో ఎందుకు అలా వెళ్తున్నావని ఆటో డ్రైవర్‌ ప్రశ్నించగా, ఆ వ్యక్తి దురుసుగా మాట్లాడి పిడిగుద్దులతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

ఈ దాడిలో అబ్దుల్‌ కరీం తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments