HomePOLITICAL NEWSArmoorప్రకృతి పండుగ బతుకమ్మ.. మహిళల సంబురం

ప్రకృతి పండుగ బతుకమ్మ.. మహిళల సంబురం

చౌడమ్మ కొండూరులో వేడుకల్లో పాల్గొన్న పైడి సుచరిత రెడ్డినందిపేట్‌ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామం మధ్యలో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, కోలాటాలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి కుమార్తె, పైడి రాకేశ్‌ రెడ్డి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ పైడి సుచరిత రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో సంతోషమని, చిన్నప్పటి నుంచి గ్రామాల్లో ఈ పండుగ వాతావరణాన్ని చూస్తూ పెరిగానని తెలిపారు. కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నిండాలని, రైతులకు మంచి జరగాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలని, ఆహార వృథాను నివారిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి సాయి, క్రాంతి, అజయ్‌, రాజా మోహన్‌, మహేందర్‌, కమలం కాకా, నితీష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments