HomeCRIMEఆబ్కారీలో నూతన కార్యవర్గానికి ఘన సన్మానం..

ఆబ్కారీలో నూతన కార్యవర్గానికి ఘన సన్మానం..

బాసర జోన్‌ (సీడీ–2) పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గానికి నిజామాబాద్‌ డీపీఈఓ కార్యాలయంలో మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు.

అసోసియేషన్‌ చైర్మన్‌ కైలాస్‌ పవార్‌, వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, కోశాధికారి చల్లా బాబు.. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి కె.జి. నందగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీపీఈఓ చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

టిఎన్జీవోస్ ఎక్సైజ్‌ సెంట్రల్‌ ఫోరం ఉపాధ్యక్షుడు, కార్యాలయ సూపరింటెండెంట్‌ కె.అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఎక్సైజ్‌ శాఖలో ఫీల్డ్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ సిబ్బంది, ఎగ్జిక్యూటివ్‌ అధికారుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.

శాఖ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ కోశాధికారి భాస్కర్‌రావు, డీటీఎఫ్‌ నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.విలాస్‌కుమార్‌, డీపీఈఓ కార్యాలయ ఏఏఓ నర్సయ్యతో పాటు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌, శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments