ఆయిల్ డబ్బా పేలి మహిళ మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమీర్పూర్ గ్రామానికి చెందిన అని కొన్ని రోజుల క్రితం సుమారు 10-20 లీటర్ల బ్లూ కలర్ రసాయన ఆయిల్ డబ్బాను తీసుకొచ్చి పెట్టుకున్నారు.
అయితే, ఆ డబ్బా చాలా రోజులుగా ఉండటంతో నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని చెత్తకుప్ప వద్ద తీసుకెళ్లి ఆ రసాయన డబ్బాను విప్పుదామని ఒక్కసారి దాన్ని కొట్టడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ (పేలుడు) అయింది.
ఆ సమయంలో ఒక్కసారిగా వచ్చిన తీవ్రమైన ప్రెషర్‌కు డబ్బా పగిలిపోయి, ఆమె కాళ్లు తెగిపోవడంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఒకటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీ షిఫ్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
