ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా గంగస్థాన్ ఫేస్ 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఉదయం ఆరున్నర గంటలకు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత కొండెల గీత సాయిరెడ్డి దంపతులు మూడవరోజు పూజను నిర్వహించారు
ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈరోజు మూడవ రోజు కావడం తో అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి గా దర్శనమిస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రోజా రమణి, సందీప్ రెడ్డి , లక్ష్మణ్ పటేల్, జీవన్ పటేల్,
రమణ,మయూరి, మహేష్ రెడ్డి, వేణు ,కవిత, స్వప్న , లత తదితరులు పాల్గొన్నారు
