నవీపేట–బాసర రైల్వే స్టేషన్ల మధ్య ఘటననవీపేట,బాసర రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ నెల 12న రాత్రి 9.16 గంటలకు ముందు రైల్వే కిలోమీటర్ నంబర్ 443/29–31 వద్ద మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు.
ప్రాథమికంగా గుర్తుతెలియని రైలు కిందపడి మృతిచెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.మృతుడి వద్ద గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఈ ఘటనపై నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 192/2026, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడిని గుర్తించినవారు లేదా ఆయన కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినవారు నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై హెచ్. సాయిరెడ్డిని 8712658591 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
