HomeCRIMEమైనింగ్ ఏ డి ఇంట్లో ఏసీబీ సోదాలు

మైనింగ్ ఏ డి ఇంట్లో ఏసీబీ సోదాలు

మైనింగ్ ఏడీ జయరాజు నివాసం పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా పనిచేస్తున్నారు . ఆయన తన అధికారిక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల పై ఏసీబీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.

హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments