కేసీఆర్‍కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్ రావు పథకాలు సిద్ధం చేస్తున్నాడని ఈ మేరకు ఎమ్మెల్యే లతోను సీక్రెట్ భేటీలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే మెదక్ ఎమ్మెల్యేలతో హరీశ్ రావు మీటింగ్ పెట్టారన్నారు కేటీఆర్ కు వారసత్వం ఇవ్వడం సరికాదని హరీశ్ రావు ఈ భేటీ అన్నట్లు ఆ మీటింగ్‍లో ఉన్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ విషయం చెప్పారని కవిత ఆరోపించారు .
బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తన హస్తగతం చేసుకొని ఆ తర్వాత బీజేపీ సపోర్ట్ తీసుకోవాలనేది హరీష్ ప్లాన్ అని ఆమె ఆరోపించారు. అందుకే హరీశ్ రావు తరుచు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడితో మంతనాలు సాగిస్తున్నదన్నారు రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్‍లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు వచ్చినప్పుడల్లా ఆయనకు పసుపు, మిరియాలు కలిపిన పాలు వెళ్తుంటాయని ఆ రోజు హరీశ్ రావు పూర్తిగా తన కార్యక్రమాలను రద్దు చేసుకోని ఆయనతో మీటింగ్ పెడతారని కవిత ఆరోపించారు.
మరో వైపు ముఖ్యమంత్రితో నూ కచ్చితంగా హరీశ్ రావుకు లాలూచీ ఉందన్నారు. . కొద్ది రోజుల క్రితమే లండన్‍లో సీఎంరేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మీటింగ్ జరిగిందన్నారు. నిజంగా లండన్‍లో ఈ ఇద్దరి మధ్య లాలూచీ లేకపోతే హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. .
ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు ఆంధ్ర సంస్థలతో లాలూచి అయ్యారని పాల వ్యాపారం లోనే ఒక్క నారాయణ, చైతన్య కాలేజ్ లకే నెలకు 5 కోట్ల చొప్పున 8 ఏళ్లుగా 960 కోట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు.
కిమ్, కామినేని, యశోద వంటి హాస్పిటల్స్ తోనూ పాల వ్యాపారం చేశారన్నా్రు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఇలా ఆంధ్రావాళ్లతో పాల వ్యాపారం చేయటం క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నించారు.
