HomeLaw and Orderసీపీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్‌ సిస్టర్స్‌

సీపీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్‌ సిస్టర్స్‌

రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి చెందిన సిస్టర్స్‌ గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సమాజంలో శాంతి, భద్రతతోపాటు సోదరభావం, మానవతా విలువల పెంపొందింపునకు పోలీసు శాఖ చేస్తున్న సేవలను సిస్టర్స్‌ అభినందించారు.

రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సిస్టర్స్‌ వనజ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments