రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది, సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రయాణికులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పండుగ వేళ ప్రజల భద్రత, సౌకర్యమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
