ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈనెల 30వ తేదీన నిజామాబాద్ లో జరిగే తన వివాహానికి హాజరై తనను ఆశీర్వదించాలని కోరుతూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజి ఉపాధ్యక్షులు రామర్తి గోపి గారితో కలిసి శుభలేఖ అందించి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా వరద బట్టు వేణురాజ్ గారు మాట్లాడుతూ నా వివాహ వేడుకకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి గారు నా వివాహానికి హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు.
