HomeLaw and Orderఎస్ఐఆర్‌లో వ్యత్యాసాలపై నోటీసులుపత్రాలు సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలి..

ఎస్ఐఆర్‌లో వ్యత్యాసాలపై నోటీసులుపత్రాలు సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలి..

గ్రామ పంచాయతీల్లోనే విచారణకు అవకాశంఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్‌ పూర్తయిన నేపథ్యంలో.. పాత ఎస్ఐఆర్‌ జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు, తండ్రి పేర్లు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు.పాత జాబితాలోని వివరాలతో ప్రస్తుత ఓటర్ల వివరాలు సరిపోలకపోవడం, వయసులో తేడాలు ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ఆయా వ్యత్యాసాలను సరిదిద్దుకునేందుకు నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు, పట్టాదారు పాస్‌బుక్‌, జనన తేదీని నిర్ధారించే ఎస్‌ఎస్‌సీ మెమో, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు తదితర 13 రకాల పత్రాల్లో తగిన ఆధారాలను సమర్పించే అవకాశం కల్పించారు.

‘నో మ్యాపింగ్‌’కూ నోటీసులుఎస్ఐఆర్‌ ఇంటింటి సర్వే సమయంలో కొందరు ఓటర్లు తమ తల్లిదండ్రులు, తాతలు లేదా ఇతర బంధువుల పాత ఓటరు జాబితా వివరాలతో సంబంధాన్ని నిరూపించే ఆధారాలు సమర్పించలేకపోయారు.

దీంతో ఆయా ఓటర్లను ‘నో మ్యాపింగ్‌’ కింద గుర్తించారు. వీరికి కూడా నోటీసులు జారీ చేసి, సంబంధిత 13 రకాల ధ్రువపత్రాల్లో తగిన ఆధారాలను సమర్పించాలని సూచించారు.వయసు ఆధారంగా కూడా ఓటర్లకు వేర్వేరు రకాల ధ్రువపత్రాలు సమర్పించాల్సిన విధానాన్ని అధికారులు తెలియజేశారు.

నిర్దేశించిన పత్రాలను సమర్పించి విచారణకు హాజరైతే వారి వివరాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. ఆధారాలు సమర్పించకపోతే అర్హతపై సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.గ్రామ పంచాయతీల్లోనే విచారణనోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ తేదీన సంబంధిత అధికారులు సూచించిన ప్రదేశానికి హాజరు కావాలి.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా గరిష్ఠంగా గ్రామ పంచాయతీల్లోనే నోటీసుల స్వీకరణ, ధ్రువపత్రాల సమర్పణకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోనే అవసరమైన పత్రాలను సమర్పించుకునే అవకాశం ఉంటుంది.

ఎంఆర్ఓ కార్యాలయాలకు రావాల్సిన ఇబ్బంది లేకుండా గ్రామస్థాయిలోనే ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments