చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మియాపూర్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న మల్లికార్జున (16) పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో మల్లికార్జున ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులు గమనించిన పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
