హైదరాబాద్ పాత బస్తీ లో అర్ధరాత్రి ఎంఐఎం నేత దారుణ హత్యకు గురయ్యారు.పాతబస్తీ లో యంఐయం నేత మహబూబ్ అలీ హత్యకు గురికావడం కలకలం రేపింది .
హత్యకు పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి, ఉన్న గుంటల్ షా బాబా దర్గా వద్ద ఉన్న మహబూబ్ అలీపై గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.
మహబూబ్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూమృతి చెందారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
