HomeCRIMEమహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత400 బ్యాగులు.. 100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం..

మహారాష్ట్రకు తరలుతున్న పీడీఎస్‌ బియ్యం పట్టివేత400 బ్యాగులు.. 100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం..

ట్రాన్స్‌పోర్టు యజమానితో పాటు మరో వ్యక్తి అదుపులోనగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఉన్న న్యూ పాపులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వద్ద సుమారు 400 బ్యాగుల పీడీఎస్‌ బియ్యాన్ని టౌన్‌–1 పోలీసులు పట్టుకున్నారు. బియ్యం విలువ, రవాణాకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు న్యూ పాపులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 400 బ్యాగులు.. దాదాపు 100 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ట్రాన్స్‌పోర్టు యజమాని జానీ పాషాతో పాటు అబ్దుల్‌ లతీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్‌–1 ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments