పిడుగు పడడం తో జేబులో ఉన్న ఉన్న సెల్ ఫోన్లు పేలిపోవడంతో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బొప్పాజీవాడ శివారులో జరిగింది.
బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గుల్‌కు చెందిన గైని శంకర్ శనివారం పొలంలో పనులు చేస్తున్నారు . వర్షం ప్రారంభం కావడంతో గొడుగు పట్టుకుని అక్కడే నిల్చున్నారు. ఇంతలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలిపోయాయి.
షాక్ అయిన ఇద్దరూ స్పృహతప్పి పొలంలోనే పడిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఎడ్లబండిపై సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని మెయిన్ రోడ్డు మీదకి తరలించారు అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
