HomeEditorial Specialగులాబీ దండు సైలెంట్ ఎందుకు .....కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి వెనుకడుగు ?......షకీల్ సానుభూతి వెనుక...

గులాబీ దండు సైలెంట్ ఎందుకు …..కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి వెనుకడుగు ?……షకీల్ సానుభూతి వెనుక మర్మమేమిటో

తెలంగాణ రక్షణ సేన తోలి సభ లో కవిత నిజామాబాద్ వేదికగా జిల్లాలో బిఆర్ యస్ నేతలను ఉతికి ఆరేశారు. గత పదేళ్ల బిఆర్ యస్ పాలన లో జిల్లా అధోగతి పాలయిందంటూ ఏకి పారేశారు.రెండేసి పర్యాయాలు ఎమ్మెల్యే లుగా గెలిచినవారు కోట్లకు పడగలేత్తరంటూ ఆరోపించారు.కెసిఆర్ అంతరంగికుడిగా చెలామణి లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ని అయితే ఏకంగా శాపనార్థాలు పెట్టారు వెన్నుపోటు దారుడని కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి మంతనాలు చేశాడంటూ బాంబు పేల్చారు. ఆయన గంజాయి దందా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

మూత పడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కెసిఆర్ ను ఒత్తడి చేస్తే కేటీఆర్ ఆయన దోస్తు కోసం అడ్డుకున్నాడని కాళేశ్వరం ప్రాజెక్టు తో కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చాయా అంటూ దెప్పి పొడిచారు.అసలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఎంపీ ఎమ్మెల్యే లున్న బీజేపీ ని వదిలేసి కవిత కేవలం గులాబీ నేతలను దుమ్ము దులిపేసారు.అసలే గాయి గత్తర లేపడం నిష్ణాతులుగా ముద్ర ఉన్న గులాబీ నేతలు కవిత మీద ఎంత తీవ్ర స్థాయిలో విరుచుక పడుతారోనని అంతా భావించారు. కానీ ఎప్పటిలాగే గులాబీ నేతలు అందరూ సైలెంట్ అందులోనూ మాజీ ఎమ్మెల్యే లంతా లోకల్ ఉన్నారు.కానీ ఏ ఒక్కరూ కవిత ఆరోణలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేక పోయారు.

ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఒక్కరే స్పందించారు సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు అదికూడా కవితమ్మ అంటూ సంబోధించారు.ఆమె విజ్ఞత కే వదిలేస్తున్న అన్నారు బీజేపీ కాంగ్రెస్ నేతల ఆరోణలకు ఒంటి కాలు మీద లేచి శివాలెత్తే గులాబీ నేతలు కవిత ఆరోణలకు కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేక పోయారనేది ఆ పార్టీ శ్రేణులకు ఆసక్తి గా మారింది.

ఆమె ఆరోణలకు ఆన్సర్ లేదా ? లేదా పట్టించుకోక పోవడం వ్యూహాత్మకమా అనేది చర్చనీయాంశం అయింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అయితే ఓ అడుగు ముందుకేసి కవిత కన్నీళ్లు పెట్టుకోవడం సానుభూతి వ్యక్తం చేశారు.పరోక్షంగా ఆమె వ్యాఖ్యలకు స్వాగతించారు ఆమె బోధన్ ఆడపడుచు అంటూనే పోటీ చేస్తే ఆహ్వానిస్తాన్నారు.ప్రశాంత్ రెడ్డి ని ఆమె టార్గెట్ చెయ్యడం మెజార్టీ మాజీ ఎమ్మెల్యే లు లోలోపల సంబర పడుతున్నారనే టాక్ గులాబీ గ్యాంగ్ లో ఉంది.బీఆర్ ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ కవిత చేసిన కామెంట్స్ జనాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్నది వేరే అంశం.

కానీ జిల్లా బీఆర్ ఎస్ నేతలు కవిత కామెంట్స్ పై స్పందించిన తీరు చూస్తుంటే కవితపై ఘాటు వ్యాఖ్యలేమి చేయలేదు. ఈ ఎపిసోడ్ అంతగా చర్చకు కూడా దారితీయలేదన్న టాక్ కూడా నడుస్తోంది. అటు బీజేపీలో ఎంపీ అరవింద్ ను మాత్రమే టార్గెట్ చేశారు కవిత. ఇక కాంగ్రెస్ పై పెద్దగా హాట్ కామెంట్స్ చేయలేదు కవిత. అధికార పార్టీ మీద ఆచితుచి కామెంట్స్ చేశారన్న వాదన పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఇంకా అసెంబ్లీ ఎన్నికలు రెండున్నరేళ్లు ఉన్నాయి. ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో కవిత తన పార్టీ బలోపేతం కోసం సభలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. కవిత పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే కవిత కొందరు నేతలను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనే దానిపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments