HomeCRIMEఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్లు.....,ఎట్టకేలకు అర్బన్ సీఐ స్వప్న సొంత జిల్లాకు .....ఫలించిన బదిలీ యత్నాలు

ఎక్సైజ్‌ శాఖలో ఇన్‌స్పెక్టర్లు…..,ఎట్టకేలకు అర్బన్ సీఐ స్వప్న సొంత జిల్లాకు …..ఫలించిన బదిలీ యత్నాలు

నిజామాబాద్‌ ఎక్సైజ్‌ శాఖలో లో మరో సారి బదిలీ లు అయ్యాయి ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. నిజామాబాద్‌లో ఎక్సైజ్ ఎస్హెచ్ఓ పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ స్వప్నను వరంగల్‌ అర్బన్‌కు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో సిద్దిపేట డిపీఎఫ్‌ ఎస్‌హెచ్‌వో సరితను నిజామాబాద్‌కు బదిలీ చేశారు.

అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ను మెదక్‌కు, మరో ఇన్‌స్పెక్టర్‌ బాలకిషన్‌ను ఖమ్మం జిల్లా మధిరకు బదిలీ చేశారు. నిజామాబాద్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న మల్లేష్‌ను ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.నిజామాబాద్ అర్బన్ సీఐ స్వప్న సుదీర్ఘ కాలంగా పనిచేసారు.

సమర్థవంతంగా పనిచేసారు అనేక వివాదాలు ఎదుర్కున్నారు.కొందరు కానిస్టేబుల్ ఆమె లక్ష్యంగా చేసుకొని తెరవెనుక ఉండి అనేక వివాదాలు సృష్టించారు.దీనితో సొంత జిల్లాకు వెళ్ళడానికి గత రెండు నెలలుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.ఎట్టకేలకు ఆమె అర్జీ ని అంగీకరించి సొంత జిల్లాకు పోస్టింగ్ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments