HomeEditorial Specialఐడి సి యం ఎస్ ఛైర్మెన్ గా రామకృష్ణ ?

ఐడి సి యం ఎస్ ఛైర్మెన్ గా రామకృష్ణ ?

సహకార సంఘాల లకు సంబంధించి ఛైర్మెన్ ల నియామకం పక్రియ కొలిక్కివస్తున్నాయి.ఎమ్మెల్యే ల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో నే నియామక పక్రియ క్లిష్టంగా ఉండే కానీ అది కూడా కొలిక్కి వస్తుంది.

మండల స్థాయి లో క్రియాశీలకంగా పనిచేసిన ద్వితీయ శ్రేణి నేతలకు సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు కట్టబెట్టేలా పీసీసీ నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలకు పదవుల సర్దుబాటు జరుగుతుంది సహకార సంఘాల ఛైర్మెన్ నియామకాలు పూర్తీ అవ్వగానే డీసీసీసీ…డిసియంఎస్ లకు పూర్తీ స్థాయి పాలక వర్గంను ప్రభుత్వం నియమించబోతుంది. డీసీసీబీ ఛైర్మెన్ గా కుంట రమేష్ రెడ్డి నియామకం దాదాపు ఖరారు అయింది.

మరో వైపు డీసీసీ అధ్యక్షులకు కూడా ప్రోటోకాల్ పదవులు ఇవ్వాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో జిల్లా లో ఇద్దరికి డీసీసీ హోదా లున్నాయి. నగేష్ రెడ్డి బొబ్బిలి రామకృష్ణ లు న్నారు. నగేష్ రెడ్డి కి ఇందిరమ్మ కమిటీ ఛైర్మెన్ గా నియామకం కోసం కసరత్తులు జరుగుతున్నాయి మరో వైపు అర్బన్ డీసీసీ గా ఉన్న రామకృష్ణ కు సైతం జిల్లా స్థాయిలో ప్రోటోకాల్ వుండే పోస్టు లో నియమించాలని పీసీసీ కసరత్తులు చేస్తుంది.

ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మెన్ పదవి కట్టబెట్టాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ ప్రతిపాదిస్తున్నారు. ఎలాగో డీసీసీబీ ఛైర్మెన్ గా రెడ్డి సామజిక వర్గంకు చెందిన రమేష్ రెడ్డి నియామకం దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో డిసియం ఎస్ ను బీసీ లకు ఇవ్వాలని అగ్ర నేతలు సూత్రపాయంగా అంగీకారానికి వచ్చారు కానీ ఆ పదవి ఎవరికి కట్టబెట్టాలనేది తానే పేరు ఇస్తానని పీసీసీ చీఫ్ జిల్లా ఎమ్మెల్యే లకు స్పష్టం చేసి నట్లు సమాచారం ఎలాగో డీసీసీ బి విషయంలో తాము చెప్పిన రమేష్ రెడ్డి విషయంలో మహేష్ ఓకే చెప్పడం తో డిసియం ఎస్ విషయంలో తాము ఏమి అడ్డు తగిలి పరిస్థితి ఎమ్మెల్యే లకు లేదు.

అందుకే మహేష్ చెప్పిన వారికి ఆ పదవి దక్కనుంది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలని మహేష్ సైతం ఎడతెగని కసరత్తులు చేస్తున్నారు. అర్బన్ కు చెందిన వ్యక్తికే ఈ పోస్టు ఇవ్వాలనేది మహేష్ ఆలోచనగా ఉంది.

ఎలాగో డీసీసీ లకు ప్రోటోకాల్ పోస్టు ఇవ్వాలని ఏఐసీసీ చెప్తుండడం తో అర్బన్ డీసీసీ రామకృష్ణ పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. మున్నారు కాపు సామజిక వర్గం తో పాటు మొదటి నుంచి విధేయుడి గా ఉన్న రామకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments