HomeCRIMEఎట్టకేలకు వేటు .....మొద్దు నిద్ర వీడిన ఉన్నతాధికారులు ........నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌..కేసులో సబ్‌రిజిస్ట్రార్‌ అరెస్టు..

ఎట్టకేలకు వేటు …..మొద్దు నిద్ర వీడిన ఉన్నతాధికారులు ……..నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌..కేసులో సబ్‌రిజిస్ట్రార్‌ అరెస్టు..

కాసుల యావ లో పడి అడ్డగోలుగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తూ అమాయక ప్రజలను అవస్థలు పెట్టె అధికారుల ఫై ఎట్టకేలకు వేటు పడింది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో నిజామాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఖుద్సియా బాదర్‌ను ఒకటో టౌన్‌-పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో ఆమె నాలుగో నిందితురాలిగా ఉన్న ఆమెను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు , చట్టపరమైన ప్రక్రియ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు టౌన్‌-ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.

ఆర్సపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 169/3లోని నాలుగు ప్లాట్లను జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం మెమో నంబర్‌ G3/A28/2022, తేదీ 18.10.2022 ద్వారా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. అయినప్పటికీ ఆ సర్వేనెంబర్ లోని 15 16 17 18 నంబర్ గల ప్లాట్ లను సబ్‌రిజిస్ట్రార్‌ ఖుద్సియా బాదర్‌ నిషేధిత భూములను నలుగురు పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.

అయితేపరస్పరం కుమ్మక్కై తప్పుడు యాజమాన్య హక్కులను చూపిస్తూ సేల్‌డీడ్లను అమలు చేయడం, నిషేధిత భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం వంటి అభియోగాలు సదురు అధికారి మీద వచ్చాయి. మరో వైపు బాధితులు సైతం కఠిన చర్యలకోసం పిర్యాదు లు చేసారు చివరికి కోర్టు ఆదేశాలు బాధితుడు పిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు గతంలోనే ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేసారు.

రిజిస్ట్రేషన్‌ రికార్డులు, సంబంధిత డాక్యుమెంటరీ ఆధారాలను పరిశీలించిన అనంతరం పలువురి ని అరెస్టు చేశారు కానీ సబ్‌రిజిస్ట్రార్‌ విషయంలో నే జాప్యం జరిగింది ఆమె పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు టౌన్‌-1 ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.

మహిళా అధికారి మీద క్రిమినల్ కేసు నమోదు కావడం ఆలస్యమైనసరే అరెస్టు చెయ్యడం రిజిస్ట్రేషన్ అధికారుల్లో వణుకు మొదలైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments