HomeCRIMEఅశోక్‌సాగర్‌లో తల్లీకుమారుడి మృతదేహాలు

అశోక్‌సాగర్‌లో తల్లీకుమారుడి మృతదేహాలు

యెడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులునిజామాబాద్‌ నగర శివారులోని అశోక్‌సాగర్‌ చెరువులో తల్లీకుమారుడి మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ఇద్దరూ చెరువులోకి దూకి మృతిచెందారా.. లేక ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారా అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఘటనపై యెడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments