పదేళ్ల అధికారం అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిన వందల ఎకరాల భూముల చిట్టాను బయటకి తీయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు ఆయన బుధవారం అసెంబ్లీ వేదిక గా కీలక ప్రకటన చేసారు కెసిఆర్ దంపతుల పేరిట నిబంధనల ప్రకారం 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం వారి వద్ద 67 ఎకరాలు ఉందని వెల్లడించారు.
ఇక కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 123 ఎకరాల భూమి రిజిస్టరై ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో కేటీఆర్ పేరు మీద 49 ఎకరాలు, భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, హిమాన్షు పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉందని తెలిపారు.
ఏ వ్యాపారం చేసి ఆ కుటుంబం ఇన్ని ఎకరాలు సంపాదించింది.. ఇదంతా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కాదా? అని సీఎం రేవంత్ నిలదీశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫామ్‌హౌస్ భూముల లెక్కలను ఇప్పుడే తేల్చాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను అసెంబ్లీ సాక్షిగా ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కేవలం 30 రోజుల్లోనే స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు, ముఖ్యంగా ఎస్సీలను ఆ భూములకు యజమానులుగా చేస్తామని స్పష్టం చేశారు. ఏ భూమినైతే పసుపు నీళ్లతో శుద్ధి చేశారో, అదే భూమిలో ఎస్సీలకు హక్కులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
రాష్టం లో 9 జిల్లాలోని 30 మండలాల్లో 439 ఎకరాల భూమి కెసిఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద వుందన్నారు.కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు కుటుంబాలకు ఎక్కడెక్కడ ఏ మేరకు భూములు ఉన్నాయనేది ఆయన వివరించారు
