HomeCRIMEహోంగార్డుపై దాడి.. 15 రోజులు జైలు..రూ.3,050 జరిమానవిధించిన న్యాయస్థానం

హోంగార్డుపై దాడి.. 15 రోజులు జైలు..రూ.3,050 జరిమానవిధించిన న్యాయస్థానం

విధుల్లో ఉన్న హోంగార్డును దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం 15 రోజుల జైలు శిక్షతోపాటు రూ.3,050 జరిమానా విధించింది. కుల్సుంపురా పోలీసుల వివరాల ప్రకారం.. జియగూడకు చెందిన పల్లపు శ్రీనివాస్ (40) సెప్టెంబరు 15న నెహ్రూ స్కూల్ వద్ద రోడ్డు డైవర్షన్‌ను అతిక్రమించి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు భాస్కర్ (HG 8481) ప్రశ్నించడంతో అతడిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఘటనపై హోంగార్డు ఫిర్యాదుతో కుల్సుంపురా పోలీసులు ఈ-పెట్టి కేసు నమోదు చేశారు. కేసు నాంపల్లిలోని గాంధీ భవన్ మనోరంజన్ కాంప్లెక్స్‌లోని IV ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి. సావిత్రిదేవి ఎదుట బుధవారం విచారణకు వచ్చింది.

నేరం రుజువు కావడంతో శ్రీనివాస్‌కు 15 రోజుల జైలు, రూ.3,050 జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. BNS సెక్షన్లు 292, 221, 115(2), CP యాక్ట్ 70(బి) కింద కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించినా, సిబ్బందిపై దాడికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments