HomeTelanganaNizamabadదీపాల వెలుగుల్లో మోదీ జన్మదిన వేడుకలు..

దీపాల వెలుగుల్లో మోదీ జన్మదిన వేడుకలు..

దేశ సేవలో మరింత శక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించిన టైక్వాండో క్రీడాకారులుప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మేచూర్‌ టైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం బసవ గార్డెన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టైక్వాండో క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు దీపాలు వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

దేశ సేవలో ఆయన మరింత శక్తి, ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అసోసియేషన్‌ అధ్యక్షుడు, భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్‌కుమార్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.క్రీడలతో యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.

క్రీడలతో పాటు సేవా భావాన్ని అలవరుచుకుని దేశ అభివృద్ధికి యువత తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో టైక్వాండో క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments