HomeTelanganaNizamabadటీఆర్ఎస్‌ నూతన కార్యవర్గానికి సన్మానం

టీఆర్ఎస్‌ నూతన కార్యవర్గానికి సన్మానం

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన నిజామాబాద్‌ జిల్లా నూతన కార్యవర్గానికి చెందిన నాయకులకు శుక్రవారం నిజామాబాద్‌లోని టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా అధ్యక్షుడు ఏలేటి నవీన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఇన్‌చార్జి కందేటి మౌనికరెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలీం, రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నరేశ్‌ నాయక్‌, నిజామాబాద్‌ టౌన్‌ ఇన్‌చార్జి యెండల ప్రసాద్‌, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ రజక్‌, అర్బన్‌ మైనార్టీ ఇన్‌చార్జి షాన్వాజ్‌, బంజారా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌ నాయక్‌లను ఈ సందర్భంగా సత్కరించారు.

నూతన బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు అవంతికుమార్‌, సొసైటీ చైర్మన్‌ మగ్గరి హన్మాండ్లు, శ్రీనివాస్‌గౌడ్‌, సంతోష్‌, యువ నాయకులు దినేష్‌, సాయినిఖిల్‌, మహేష్‌, నికిత్‌, ఆశిష్‌, రేఖ, శోభ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments