ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్‌లో మృతి చెందిన రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్.సతీష్ (41)కు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం నివాళులర్పించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సతీష్ మృతదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సతీష్‌కు నివాళులర్పించారు. నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎన్‌ఎస్‌ఓ (నైట్ సెక్యూరిటీ ఆఫీసర్)గా విధులు నిర్వహించిన అనంతరం శుక్రవారం ఉదయం ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా తుపాకీ ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ కావడంతో సతీష్ మృతి చెందినట్లు పోలీసు శాఖ వెల్లడించింది.
సమాచారం అందుకున్న సీపీ సాయి చైతన్య ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నివాళుల అనంతరం సతీష్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన స్వస్థలమైన ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలానికి తరలించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణస్వామి, శ్రీశైలం, నరేందర్, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేశంతో పాటు పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.
