మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధి లోని పోచారం లో సోమవారం 22 కేజీల గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. యంనంపేట నుంచి కుషాయిగూడ వైపు వెళ్తున్న బెలినో కారును ఉప్పల్ ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేయగా.. కారులోని ఓ సంచిలో సుమారు 22 కేజీల గంజాయి లభ్యం అయి నట్లు సమాచారం.
వెంటనే గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
