ట్యాంక్ బండ్పై గణేశ్ నిమజ్జనానికి అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేయడం దుమారం రేపుతోంది.హైకోర్టు ఆదేశాల మేరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. అంతేగాక ట్యాంక్ బండ్ చుట్టూ కంచె లను ఏర్పాటు చేసింది. మొదటి మూడు రోజులు స్తబ్దంగా ఉన్న భాగ్యనగర్ ఉత్సవ సమితి రంగంలోకి దిగింది.
సోమవారం ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకు దిగింది . బారికేడ్లను తొలగించిన అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఉన్నపలంగా నిమజ్జనం ఏర్పాట్లు చెయ్యాలని క్రేన్ లను అందుబాటులో లోకి తేవాలని డిమాండ్ చేసింది లేని పక్షం లో తామే ఆ పనులు చేస్తామన్నది . ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా మోహరించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గణేశ్ నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ వద్ద ఆంక్షలపై ఉత్సవ సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, ట్యాంక్ బండ్ వద్ద సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది.
