HomeCRIMEఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరుగురికి జైలు శిక్ష

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరుగురికి జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగారంమరో ముగ్గురికి రెండేళ్ల సాధారణ జైలు.. జరిమానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు హత్యాయత్నం, గాయపరిచిన కేసులో నిందితులకు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. నిజామాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) చట్టం కేసుల ప్రత్యేక న్యాయస్థానం-కమ్‌ రెండో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.నారాయణ సోమవారం తీర్పు వెలువరించారు.

కేసులో నిందితులుగా ఉన్న A1, A3, A4, A5, A6, A7లను దోషులుగా నిర్ధారించారు. హత్యాయత్నం నేరం కింద A1 లచ్చోళ్ల నడిపి సైలూ, A3 లచ్చోళ్ల నడిపి పెద్ద సైలూ అలియాస్‌ పెద్ద సైలూ, A4 లచ్చోళ్ల గణేశ్‌లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు.

జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఐపీసీ 324 సెక్షన్‌ కింద A1, A3, A4, A5 మెట్టు పెద్ద ముత్తెన్న అలియాస్‌ ముత్యంం, A6 మెట్టు అశోక్‌, A7 రొడ్డొళ్ల అలియాస్‌ రొడ్డ రవికి రెండేళ్ల సాధారణ కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) సవరణ చట్టంలోని సెక్షన్‌ 3(2)(va) కింద A1, A3, A4, A7లకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఈ శిక్షల్లో అన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

2022లో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 116/2022గా కేసు నమోదైంది. ఐపీసీ 307, 324 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) సవరణ చట్టంలోని సెక్షన్‌ 3(2)(va) కింద దర్యాప్తు చేపట్టి అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. A2పై విచారణ వేరుగా కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments